వైఎస్ వివేకానంద రెడ్డి(Ys Vivekananda reddy) హత్య కేసులో సీబీఐ(CBI) దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా సీబీఐ బృందం(CBI Team) మరోసారి పులివెందులకు వెళ్లి వైఎస్ వివేకా ఇంటిని పరిశీలించింది. ఇంట్లో హత్య జరిగిన ప్రదేశాన్ని మరోమారు పరిశీలించింది. ఆ తర్వాత ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) ఇంటికి చేరుకుంది. అవినాశ్ రెడ్డి పీఏ రమణారెడ్డితో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకుంది.
సీబీఐ(CBI) అధికారులు వివేకా కంప్యూటర్ ఆపరేటర్ అయిన ఇనయతుల్లాతో మాట్లాడారు. వైఎస్ వివేకా(Ys Vivekananda reddy) హత్యాస్థలంలోని బాత్రూమ్, బెడ్రూమ్ లను సీబీఐ అధికారులు పరిశీలించారు. వివేకా ఇంటి నుంచి అవినాశ్ రెడ్డి(Avinash Reddy) ఇంటి వరకూ గల పరిసరాలను సీబీఐ అధికారులు పరిశీలించారు. వివేకా హత్య జరిగిన రోజున, ఆ టైంలో ఎవరెవరు ఉన్నారోనని ఆరా తీశారు.
ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) ఇంటి నుంచి వివేకా ఇంటి వద్దకు రావడానికి గల సమయాన్ని, సాంకేతిక ఆధారాలను సీబీఐ అధికారులు సేకరించారు. అవినాశె రెడ్డి చెప్పేది వాస్తవమా కాదా అని నిర్ధారించేందుకు పీఎను సీబీఐ(CBI) అధికారులు పులివెందుల రింగు రోడ్డు వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరోసారి వివేకా ఇంటికి వచ్చి స్థానికులతో మాట్లాడారు. వివేకా(Ys Vivekananda reddy), అవినాశ్ ఇళ్లను పరిశీలించిన తర్వాత పలువురిని తమకు కావాల్సిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.