GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరిగిన బీటెక్, బీఈడి, ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ, ఎంటెక్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోగా అందజేయాలని సూచించారు. రీవాల్యుయేషన్‌కు ప్రతి పేపర్‌కు రూ.1860 చొప్పున చెల్లించాలన్నారు.