ATP: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఆర్డీటీ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మంగళవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్‌కు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి మాట్లాడుతూ.. ఆర్డిటి కాలనీలో త్రాగునీరు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్లు లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు.