ATP: ఇటుకులపల్లి గ్రామానికి చెందిన చియ్యేడు సొసైటీ వైస్ ప్రెసిడెంట్ నారా శివారెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన కుటుంబాన్ని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం అదే గ్రామంలో గుండె శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పార్టీ నాయకుడు రామంజిని పరామర్శించారు.