SKLM: పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. వజ్రకొత్తూరు, మందస మండలాల పరిధిలో సుమారు 1,353 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. నేడు ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు రానున్నారు.