కోనసీమ: ఆలమూరు మండలం చొప్పెల్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంను గురువారం కొత్తపేట ఆర్డీవో పి.శ్రీకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులను రోగులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి ఆరా తీశారు. ఆస్పత్రి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్యశాల అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.