ASR: సర్ధార్ వల్లభ భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా వచ్చే వారం అల్లూరి జిల్లా అరకులోయలో ఐక్యత యాత్ర నిర్వహిస్తున్నట్లు మై భారత్ విశాఖపట్నం డీడీ జీ. మహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఐక్యత యాత్ర అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ట్రైబల్ మ్యూజియం వరకు ఉంటుందన్నారు.