SKLM: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రణస్థలం మండలంలో ఉన్న గో సేవా ఆశ్రమంలో ఉన్న రాధాకృష్ణులకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు.