సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలోని 45 మంది పేదలకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. రూ.22.21 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారికి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.