VZM: నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం కోవెల వీధి స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కార్యదర్శి శ్రీదేవికి శుక్రవారం స్థానికులు వినతిపత్రం అందించారు. స్మశాన వాటికలోకి మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి రహదారి లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. మార్గ మధ్యలో లోతైన కాలువ దాటి మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని చెప్పారు.