KDP: బద్వేలు ఆర్టీసీ డిపోలో డ్రైవర్ సుబ్బిరెడ్డిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిపో గేటు ఎదుట ఆదివారం టీ బ్రేక్ సమయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. సుబ్బిరెడ్డిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ సూర జనార్ధన్ రావు, కేవీ రమణ, శ్రీధర్, మల్లికార్జున, కేఎస్ రాయుడు, తదితర నాయకులు పాల్గొన్నారు.