ATP: తాడిపత్రిలో బ్రహ్మోత్సవాల సందర్భంగా 6వ రోజు స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహించగా గోవింద నామస్మరణతో ప్రాంగణం మారుమ్రోగింది. గజవాహన దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు ఉదయం 8 గంటలకు కళ్యాణోత్సవం, మధ్యాహ్నం 2 గంటలకు రథోత్సవం జరగనున్నాయి.