అన్నమయ్య: శనివారం గాలివీడు మండలంలోని పందికుంట, కొర్లకుంట, తలముడిపి గ్రామాల్లో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి కోటి సంతకాల, రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, పేదల ఆరోగ్య హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.