కృష్ణా: గుడివాడ మండలం వలివర్తిపాడు గ్రామంలోని గణేష్ గ్రాండ్ అపార్ట్మెంట్ సమీపంలో అనుమాస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. గుడివాడ రూరల్ పోలీసులు శనివారం నిందితుడుని విచారించగా.. బీహార్ రాష్ట్రానికి చెందిన చందన్ కుమార్(19) అన్షు కుమార్‌పై కత్తితో దాడి చేసి గాయపరచినట్లు వెల్లడించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.