కృష్ణా: కంచికచర్ల పట్టణంలోని అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ అశ్రపున్నిసా బేగం తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ.. అనధికారంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడి నుంచి 7 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.