NLR: కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితిలో లేరని కూటమి ప్రభుత్వం 90 శాతం హామీలను అమలు చేసిందని ఆయన తెలిపారు. అందుకే బుధవారం అనంతపురంలో నిర్వహించనున్న ‘సూపర్ సిక్స్.సూపర్ హిట్’ సభకు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.