KDP: కడప నగరంలోని స్థానిక బిల్డప్ సర్కిల్ సమీపాన వెలసిన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయం నందు అమ్మవారికి శుక్రవారం పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.