ELR: దెందులూరు ఎంపీడీఓ కార్యాలయంలో వార్షిక ప్రణాళికలు సిద్ధం చేయడానికి గురువారం ఉదయం 9.30 గంటల నుంచి శిక్షణ సమావేశం నిర్వహించనున్నట్టు దెందులూరు ఎంపీడీఓ కె. శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అన్ని శాఖల మండల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, మండల సమైక్య అధ్యక్షులు తరగతులకు హాజరుకావాలని ఎంపీడీఓ కోరారు.