KRNL: కల్లూరు మండలంలోని చిన్నటేకూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బుధవారం ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. గ్రామ సచివాలయం, అంగన్వాడీ కేంద్రం, డా.బీఆర్ అంబేద్కర్ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజన వసతి కల్పించాలని, మెరుగైన సదుపాయాలు అందించాలని డీసీడీవో శ్రీదేవిని ఆదేశించారు.