ప్రకాశం: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇవాళ కార్మికులు నిరసన చేశారు. సేవ్ ఆర్టీసీ పేరుతో CITU ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. సెప్టెంబర్ 12న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా ప్రైవేటు విద్యుత్ బస్సుల వల్ల ఆర్టీసీ కార్మికులకు నష్టం జరుగుతుందని అవేదన వ్యక్తం చేస్తున్నారు.