VSP: ఉత్తరాంధ్ర జిల్లా భక్తుల ఇలవేల్పు శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలకు సంబంధించి పందిరిరాట ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. మార్గశిర మాసోత్సవాల సందర్భంగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పందిరి రాట వేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 19 వరకు మార్గశిర మాసోత్సవాలు జరగనున్నాయి.