ELR: నూజివీడు బాలికల ZP ఉన్నత పాఠశాల విద్యార్థినులకు సమగ్ర శిక్ష అధ్వర్యంలో బ్యూటీ, వెల్నెస్ నైపుణ్యాభివృద్ధి కోర్సును అందిస్తున్నారు. ఇంటర్న్షిప్ లో భాగంగా HM బి. అనురాధ పర్యవేక్షణలో ట్రైనీ జి. రంజిత్ కుమారి సంబంధిత కోర్సులో ఉపాధి అవకాశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. దసరా సెలవుల నేపథ్యంలో ఈ కోర్సును అందిస్తున్నట్లు పేర్కొన్నారు.