NLR: పర్యాటక రంగంలో ఉపాధి కోసం గొలగమూడి ఐఐటీటీఎం (IITTM) సరికొత్త ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెడుతోంది. ఇంటి నుంచే ట్రావెల్ ఏజెన్సీ, టూర్ గైడెన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, అడ్వెంచర్ టూర్స్ వంటివి నేర్చుకోవచ్చు. కోర్సు పూర్తయితే దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయని, త్వరలో దరఖాస్తు తేదీలు వెల్లడిస్తామని నోడల్ ఆఫీసర్ సంజీవరెడ్డి తెలిపారు.