NLR: సంగం మండలంలోని గాంధీ జన సంఘం జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో శనివారం సాంఘిక రుగ్మతల నియంత్రణ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ… చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం విద్యార్థులకు చట్టంలోని ఉండే విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.