గుంటూరు రేంజ్ పరిధిలో నలుగురు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో ఎం. వెంకట సుబ్బారావు, కె. వెంకటేశ్వర్లు, బెల్లం శ్రీనివాసరావు, చంద్రమౌళి ఉన్నారు. కాగా, రాష్ట్రంలో మొత్తం ఎనిమిది మంది సీఐలకు పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.