కోనసీమ: తుఫాన్ మూలంగా నష్టపోయిన వారికి తాత్కాలిక ఉపశమనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం, నిత్యవసర వస్తువులను రానున్న మూడు రోజులలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. తుఫాన్ ఉపశమన చర్యలు పంట నష్ట అంచనాలు రూపకల్పనపై సమీక్షించారు.