పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని తరలిస్తున్నారని వార్తలపై ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు స్పందించారు. బుధవారం రాత్రి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టరేట్ ఎక్కడికి వెళ్ళదని ఆయన అన్నారు. అలాగే 25 ఎకరాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్థల సేకరణ చేస్తున్నామని పేర్కొన్నారు.