ప్రకాశం: ఒంగోలులోని జిల్లా పోలీస్ జిల్లా కార్యాలయంలో పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ-2025ని శనివారం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో కూడా పోలీసు అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి, శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజల మన్ననలు పొందాలన్నారు.