W.G: రాష్ట్రంలో సంక్షోభంతో మూతపడుతున్న టెక్స్ టైల్స్, స్పిన్నింగ్ మిల్స్ పరిశ్రమలను కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ అక్కమాంబ టెక్స్ టైల్స్ అధ్యక్షులు డివివియస్ వర్మ కోరారు. యూనియన్ (ఏఐటీయూసీ) కార్యవర్గ సమావేశం బుధవారం యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి వర్మ అధ్యక్షత వహించి మాట్లాడారు.