VZM: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో గడిచిన మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో వరి పంటపొలాల్లో వరి చేనులో నీరు చేరడంతో పంట తడిచిపోయింది. పంట చేతికి అందివచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోయామని గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.