KRNL: గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి హంద్రీనదికి శనివారం నీటి విడుదల నిలిపివేశారు. వరద కారణంగా మూడు రోజులుగా సాగిన నీటి ప్రవాహం, ఎగువ ప్రాంతాల్లో తగ్గిపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం 376.75 మీటర్లకు చేరింది. పూర్తి స్థాయిలో 377 మీటర్లకు సమీపంగా ఉండటంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది.