తిరుపతి: నారాయణవనంలో వైద్య శాఖ అధికారులు, సిబ్బంది నిర్వహించిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని 5 ఏళ్ల లోపు చిన్న పిల్లలు అందరికీ నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ నెల 21న ఆదివారం ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.