W.G: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మద్యం షాపులు బంద్. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి గురువారం సాయంత్రం వరకు మద్యం షాపులు మూసి వేయనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె.ఎస్.వి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. సోమవారం రాత్రి ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మద్యం విక్రయిస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు.