ATP: గుంతకల్లు పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి కుంభాభిషేకం, పూర్ణాహుతి, నవగ్రహ హోమాలు, పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్షపరులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అయ్యప్పస్వాములకు, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది.