PLD: పల్నాడులో ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి నారా లోకేష్‌కు రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం అదనపు కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు దాచేపల్లి మాశెట్టి సాత్విక్ రామ్ వివరించారు. బుధవారం అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్‌ను కలిసి వివిధ సమస్యలను తెలిపారు.