GNTR: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు మల్లయ్య లింగం భవన్లో ఆత్మీయ సమావేశం జరిగింది. నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ లక్ష్యమని, విస్తృత ప్రజా ఉద్యమాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.