నంద్యాల: జిల్లాస్థాయి ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉయ్యాలవాడ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి దేవేంద్ర గౌడ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల చివరిలో గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆయన పాల్గొంటారని చెప్పారు. పీఈటీ ప్రతాప్, ఉపాధ్యాయ బృందంతో కలిసి విద్యార్థిని అభినందించారు.