»Avinash Reddys Relief In The Supreme Court Order To Telangan But In The Matter Of Arrest
Avinash Reddy:కి సుప్రీంకోర్టులో ఊరట..కానీ అరెస్టు విషయంలో
కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి(Avinash Reddy) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును.. సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం ఆదేశించింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy)కి సుప్రీంకోర్టులో కొంత ఉపశమనం లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశం తనకు ఉందని సుప్రీకోర్టు వెల్లడించింది. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని అవినాష్ కు జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నర్సింహలతో కూడిన ధర్మాసనం తెలిపింది. దీంతోపాటు అవినాష్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును ధర్మాసనం ఆదేశించింది.
నేడు(మే 23న) విచారణ జరిపిన సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. దీంతోపాటు అవినాష్ రెడ్డి వాదనలు విన్న తర్వాతనే హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు(Supreme Court) తెలిపింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మే 25న అవినాష్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది.
కానీ తన తల్లి అనారోగ్యం కారణంగా సీబీఐ(CBI) అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరిన అవినాష్ రెడ్డి అభ్యర్థనకు మాత్రం సుప్రీం నో చెప్పింది. దీంతోపాటు అరెస్టు విషయంలో సీబీఐ తాత్సారం చేస్తున్నట్లు అనిపిస్తుందని పేర్కొంది. పాత పిటిషన్ తో సంబంధం లేకుండా ఈ పిటిషన్ స్వీకరించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.