»Ap Mlc Elections Ap Cm Jagan Casts Vote In Velagapudi
AP Mlc Elections: ఓటువేసిన జగన్, బరిలో టీడీపీ అనురాధ
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు (Andhra Pradesh MLC Elections) గురు వారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి పంచుమర్తి అనురాధ (panchumarthi anuradha), వైసీపీ (YCP) నుండి ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు (Andhra Pradesh MLC Elections) గురు వారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నుండి పంచుమర్తి అనురాధ (panchumarthi anuradha), వైసీపీ (YCP) నుండి ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. ఒక్కో అభ్యర్థి విజయానికి 22 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో వైసీపీ 22 మంది ఎమ్మెల్యేలను ఒక బృందంగా ఏర్పాటు చేసి, వారితో ఓట్లు వేయిస్తోంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy) ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును (Jagan casts vote) వినియోగించుకున్నారు. అలాగే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఓటు వేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ మొదటి అంతస్తులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జగన్ తన ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాద రావు, ఎమ్మెల్యేలు నంబూరి శంకర రావు, జక్కంపూడి రాజా, కొలుసు పార్థసారథి, శ్రీకాంత్ రెడ్డి, సామినేని ఉదయభాను, పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, కోరుముట్ల శ్రీనివాసులు, వల్లభనేని వంశీ, మాజీ మంత్రులు మేకతోటి సుచరిత, పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాసు, తదితరులు ఓటు వేశారు. 175 మంది ఎమ్మెల్యేలకు గాను దాదాపు సగానికి పైగా వినియోగించుకున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుండి 151, టీడీపీ నుండి 23, జనసేన నుండి ఒకరు గెలిచారు. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవానికి వైసీపీ ఆరు, టీడీపీ ఒకటి గెలవాలి. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక జనసేన ఎమ్మెల్యే తమ తమ పార్టీలకు దూరంగా ఉన్నారు. దీంతో వైసీపీ ఆ ఆశతో ఏడో అభ్యర్థిని నిలబెట్టింది. కానీ తమకు బలం ఉండటంతో టీడీపీ పంచుమర్తి అనురాధను నిలబెట్టారు.