ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్లు వాయిదా(Postponement) పడ్డాయి. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసు కానిస్టేబుల్ పీఎంటీ/పీఈటీ ఫిజికల్ ఈవెంట్లు వాయిదా వేస్తున్నట్టు పోలీస్ రిక్రూట్ మెంట్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్లు వాయిదా(Postponement) పడ్డాయి. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసు కానిస్టేబుల్ పీఎంటీ/పీఈటీ ఫిజికల్ ఈవెంట్లు వాయిదా వేస్తున్నట్టు పోలీస్ రిక్రూట్ మెంట్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని వారు తెలిపారు. తాజా సమాచారం కోసం తమ వెబ్ సైట్ చూస్తుండాలని తెలిపింది. ఏపీలో భారీ ఎత్తున పోలీస్ నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు (Constable Posts)నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. ఈ క్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్చి 14న ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించాలని నిర్ణయించారు. పోలీసు నియామకాల కోసం గత జనవరి 22న ప్రిలిమ్స్ నిర్వహించడం తెలిసిందే. 4.59 లక్షల మంది ఈ ప్రాథమిక పరీక్షకు హాజరు కాగా, వారిలో ఉత్తీర్ణులైంది 95,209 మంది మాత్రమే. వీరి దేహదారుఢ్యాన్ని పరీక్షించేందుకు ఫిజికల్ ఈవెంట్లు (Physical events) నిర్వహించనున్నారు.