వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(Challa Bhagiratha Reddy) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం కన్నుమూశారు. కాగా.. ఆయనకు సీఎం జగన్(Ap CM Jagan) నివాళులర్పించారు. గురువారం సీఎం జగన్… నంద్యాల జిల్లా పరిధిలోని కోవెలకుంట్ల నియోజకవర్గంలోని అవుకుకు ఆయన వెళ్లారు. అక్కడకు వెళ్లి మరీ జగన్ నివాళులర్పించారు.
మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన భగీరథ రెడ్డి…తండ్రి మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. ఆదివారం నాడు ఆయనకు తీవ్రమైన దగ్గు రావడంతో నంద్యాల అక్కడి నుంచి హైదరాబాద్ కు ఆయనను కుటుంబ సభ్యులు తరలించారు.
గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భగీరథ రెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఇటీవల చేరిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ ఆయన బుధవారం కన్నుమూశారు. ఇక ఈరోజు సాయంత్రం భగీరథ రెడ్డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి.