సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇటీవలే డీజీపీ ర్యాంకు పొందిన సునీల్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మాత్తుగా బదిలీ చేసింది. సీఐడీ అదనపు డీజీగా సంజయ్‌కి అదనపు బాధ్యతలు అప్పగించింది. సంజయ్ ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ పేరు, సునీల్ కుమార్ పేరు ఎక్కువగా వినిపించింది. ఇటీవల సర్వీసు పరంగా ఉన్నత హోదా కూడా లభించింది. అంతలోనే బదిలీ చేయడం చర్చకు దారితీసింది. సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.