రాజకీయ విమర్శలు చేయని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తొలిసారి ఏపీ సీఎం జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ (YS Jagan)ను లక్ష్యంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో (AP) సైకో పాలన సాగుతోందని.. రాష్ట్రంలో వినాశనం జరుగుతోందని.. అభివృద్ధి శూన్యం.. దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన ఉందని తీవ్ర విమర్శలు చేశారు. సైకో జగన్ (Psycho Jagan) పాలన మళ్లీ వస్తే ఏపీ ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర అనంతపురం జిల్లా (Ananthapuramu District) శింగనమల (Singanamala) నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మార్తాడులో తన అల్లుడు లోకేశ్ తో కలిసి పాదయాత్రలో (Yuvagalam Padayatra) అడుగుపెట్టారు. అనంతరం బాలకృష్ణ (Balakrishna) మాట్లాడుతూ.. ‘లోకేశ్ పాదయాత్ర యువతరానికి స్ఫూర్తి. లోకేశ్ కు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారు. జగన్ సీఎం అయ్యాక ఏపీలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమమలు రాలేదు.. ఉపాధి కల్పన లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక, భూమి మాఫియా రెచ్చిపోతున్నది. చెత్తపై కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఒక్క ఏపీలోనే ఉంది. మళ్లీ సైకో పాలన వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరో చోటికి వెళ్లాల్సి వస్తుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఎవరినైనా బెదిరించవచ్చని జగన్ భావిస్తున్నారు. వైఎస్సార్ సీపీ (YSRCP) ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. చాలా మంది మా పార్టీతో టచ్ లో ఉన్నారు. సీఎం జగన్ కు పబ్జీ (PUBG Game) ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు. జగన్ ఓటమి అంచుల్లో ఉన్నాడని తెలుసు. వైసీపీ అరాచకాలను ఎదిరించేందుకు ప్రజలంతా ముందుకురావాలి. టీడీపీ పాలన మళ్లీ వస్తుంది. అందరి సమస్యలు పరిష్కరిస్తుంది.’ అని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.