MLC election : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ (Andra pradesh) లో ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల అధికారి (State Election Officer) ముకేశ్ కూమార్ మీనా అన్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరుకూ పోలింగ్ నిర్వహించునున్నట్లు ఆయన తెలిపారు. మార్చి16న ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ , 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, అయితే ఐదు లోకల్ బాడీ ఎమ్మెల్సీలు (Local body MLCs) ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ (Andra pradesh) లో ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల అధికారి (State Election Officer) ముకేశ్ కూమార్ మీనా అన్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరుకూ పోలింగ్ నిర్వహించునున్నట్లు ఆయన తెలిపారు. మార్చి16న ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ , 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని, అయితే ఐదు లోకల్ బాడీ ఎమ్మెల్సీలు (Local body MLCs) ఏకగ్రీవం అయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ ఎన్నికలలో మొత్తం ఓటర్లు – 1,056,720మంది 1538 పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. గ్రాడ్యుయేట్ (graduate) ఎమ్మెల్సీల ఓటర్లు- 10 లక్షల 519, టీచర్స్ ఎమ్మెల్సీల ఓటర్లు- 55,842, లోకల్ బాడీ ఎమ్మెల్సీల ఓటర్లు -3,059 ఓటు హక్కు వినియోగించుకుంటారని.. ప్రతీ పోలింగ్ స్టేషన్లో 100% వెబ్ కాస్టింగ్, 500 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
10 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటేయవచ్చని సూచించారు. ఇప్పటి వరకూ 77, 48,010 నగదు సీజ్ చేసినట్లు వెల్లడించారు. 1,02,819.05 లీటర్ల లిక్కర్ సీజ్ చేశామని.. 64 ఎక్సైజ్ కేసులు (Excise cases) నమోదు చేసి 75 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 7,380 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్ అయినట్లు స్పష్టం చేశారు. అలాగే 7,266 మంది బైండోవర్లు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. సాయంత్రం నాలుగులోగా క్యూలో ఉన్నవారందిరికీ ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచి 500 జంబో బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) తెలిపారు. బోగస్ ఓట్లని చెబుతున్న వాటిని పరిశీలించి యూనివర్సిటీ సర్టిఫికెట్, (University Certificate) అసెస్టేషన్ చేసి ఉందో లేదో పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఫేక్ సర్టిఫికెట్తో ఓటు హక్కు వినియోగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రలోభాల పర్వంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని ఆయా జిల్లాల కలెక్టర్లకు విచారణకు పంపిస్తున్నట్లు తెలిపారు.