అన్నమయ్య: పేదవారికి సీఎం సహాయనిది ఆపదలో అండగా నిలుస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు. సోమవారం రాజంపేటలోని బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో రాజంపేట మండలంలోని తొగురు గ్రామానికి చెందిన గునిశెట్టి రంగయ్యకు సీఎం సహాయనిధి రూ. 49,984 వేల చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.