KDP: చాపాడుకు చెందిన అల్లగుర్తి నూర్జహాన్ (55) బుధవారం వాషింగ్ మిషన్ ప్లగ్ తీస్తూ విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. మహమ్మద్ గౌస్ భార్య నూర్జహాన్ ఇంటి వద్ద మిషన్లో బట్టలు శుభ్రం చేస్తుండగా షాక్కు గురైనట్లు తెలిపారు. వెంటనే స్పందించి 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.