W.G: మొంథా తుఫాను నేపథ్యంలో తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా సోమవారం అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా తదుపరి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని తెలిపారు.