NLR: మనుబోలు మండలం కేఆర్ పురానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సంపత్ కుమార్ అనారోగ్యంతో మరణించారు. ఆయన కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, వ్యాధి తీవ్రత కారణంగా ఊపిరి ఆడక చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.