కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఘటన జరిగినప్పుడు 2వ డ్రైవర్ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్లో నిద్రపోయారు. ప్రమాదం జరగ్గానే డ్రైవర్ లక్ష్మయ్య తన వద్దకు వచ్చినట్లు శివ తెలిపారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపు కాలేదన్నారు. దీంతో బస్సు కుడివైపు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించామన్నారు.