ప్రకాశం: పామూరులోని ఓ లాడ్జిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడుకు చెందిన వ్యక్తి గ్రామానికి చెందిన వెంగబాబు జీవనోపాధి కోసం బెంగళూరుకు వెళ్లాడు. అక్కడే నివాసం ఉంటున్నాడు. ఏమైందో ఏమో పామూరులో ఓ లాడ్జిలో రూము తీసుకుని ఉరేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది